హిట్‌ లిస్ట్‌లో ఏముంది?

ABN , Publish Date - May 19 , 2024 | 06:33 AM

తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు విజయ్‌ కనిష్క హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సూర్య కతిర్‌ కాకల్లార్‌, కార్తికేయన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను...

హిట్‌ లిస్ట్‌లో ఏముంది?

తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు విజయ్‌ కనిష్క హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సూర్య కతిర్‌ కాకల్లార్‌, కార్తికేయన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను తమిళ హీరో సూర్య శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ప్రేక్షకులు క్రైమ్‌, సస్పెన్స్‌ జానర్‌ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారనీ, అదే జానర్‌లో వస్తున్న ఈ సినిమా కూడా అందరినీ అలరిస్తుందనీ నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. శరత్‌కుమార్‌, సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, సితార తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాసా స్ర్కీన్స్‌, బెక్కం ప్రొడక్షన్స్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి.

Updated Date - May 19 , 2024 | 06:33 AM