నాయకి ఏమైనాదే...
ABN , Publish Date - May 27 , 2024 | 01:06 AM
జీఏ2 పిక్చర్స్ బేనర్‌పై రూపొందుతున్న ఫన్ ఎంటర్టైనర్ ‘ఆయ్’. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె. మణిపుత్ర దర్శకుడు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో...

జీఏ2 పిక్చర్స్ బేనర్‌పై రూపొందుతున్న ఫన్ ఎంటర్టైనర్ ‘ఆయ్’. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె. మణిపుత్ర దర్శకుడు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ, విద్యా కొప్పినీడు నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘నాయకి ఏమైనాది... రంగనాయకి ఏమైనాది’ అంటూ సాగే మాస్ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. రామ్ మిర్యాల స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి