ఆ మాస్క్‌ కథ ఏమిటి?

ABN , Publish Date - May 15 , 2024 | 12:20 AM

‘ప్రేమిస్తే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తమిళ నటుడు భరత్‌ నటించిన ‘మిరల్‌’ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. వాణి భోజన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఎం.శక్తివేల్‌ దర్శకత్వం...

ఆ మాస్క్‌ కథ ఏమిటి?

‘ప్రేమిస్తే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తమిళ నటుడు భరత్‌ నటించిన ‘మిరల్‌’ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. వాణి భోజన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఎం.శక్తివేల్‌ దర్శకత్వం వహించారు. సీహెచ్‌ సతీశ్‌కుమార్‌ నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ అందరినీ భయపెట్టింది. తాజాగా రిలీజ్‌ డేట్‌ వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌లో ఓ వింత మాస్క్‌ హైలైట్‌ అయింది. పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ కనిపించింది. ఆ మాస్క్‌ కథ ఏమిటన్నది చిత్రం చూస్తే కానీ తెలియదని దర్శకుడు అంటున్నారు. ఈ చిత్రానిఇకి సంగీతం: ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, సినిమాటోగ్రాఫర్‌: సురేశ్‌ బాలా, సమర్పణ: జగన్మోహిని, ఢిల్లీ బాబు.

Updated Date - May 15 , 2024 | 12:20 AM