‘కోడి బుర్ర’ కథ ఏమిటి?

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:19 AM

తమిళ హీరో శ్రీరామ్‌ కొత్త చిత్రం ‘కోడి బుర్ర’ షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రుతి మీనన్‌, ఆరుషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసిన...

‘కోడి బుర్ర’ కథ ఏమిటి?

తమిళ హీరో శ్రీరామ్‌ కొత్త చిత్రం ‘కోడి బుర్ర’ షూటింగ్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రుతి మీనన్‌, ఆరుషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసిన అనంతరం నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ తొలి క్లాప్‌ ఇచ్చి షూటింగ్‌ ప్రారంభించారు. అనంతరం దర్శకుడు చంద్రశేఖర్‌ కానూరి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో శ్రీరామ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హీరోయిన్‌ శ్రుతి మీనన్‌ డాక్టర్‌గా నటిస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రం రూపుదిద్దుకుంటుంది’ అని చెప్పారు. ఒక ఇంట్రెస్టింగ్‌ మూవీలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని శ్రీరామ్‌ చెప్పారు. నిర్మాత కంచర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ‘నా ఫేవరెట్‌ హీరో శ్రీరామ్‌. ఆయన నటించిన ‘ఒకరికి ఒకరు’, ‘పోలీస్‌ పోలీస్‌’ వంటి సినిమాలు చాలా సార్లు చూశాను.


నా మిత్రులు గట్టు విజయ్‌ గౌడ్‌, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్‌ గౌడ్‌తో కలసి ఈ సినిమా తీస్తున్నాను’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్‌ రాగ, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్‌ కొడా, ఎడిటర్‌: శిరీష్‌ ప్రసాద్‌. రచన, దర్శకత్వం: చంద్రశేఖర్‌ కానూరి.

Updated Date - Jul 02 , 2024 | 12:19 AM