కేసు నంబర్ 15లో ఏముంది?
ABN , Publish Date - Apr 02 , 2024 | 05:42 AM
అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్ ముఖ్యపాత్రలు పోషించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘కేసు నంబర్ 15’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తడకల్ వంకర్ రాజేశ్ స్వీయ దర్శకత్వంలో...

అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్ ముఖ్యపాత్రలు పోషించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘కేసు నంబర్ 15’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తడకల్ వంకర్ రాజేశ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు. విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత సి.కల్యాణ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ టీజర్‌ను, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారందరూ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తడకల వంకర్ రాజేశ్ మాట్లాడుతూ ‘మా సినిమాకు జాన్ మంచి సంగీతం ఇస్తే, ఆనం వెంకట్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. సినిమాలో ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అని చెప్పారు.