కేస్‌ నంబర్‌ 15 ఏమిటి?

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:22 AM

అజయ్‌, రవిప్రకాశ్‌, హర్షిణి, మాండవియ సెజల్‌, చమ్మక్‌ చంద్ర, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కేస్‌ నం.15’. తడకల వంకర్‌రాజేశ్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కేస్‌ నం.15’ ఈ నెల 26న...

అజయ్‌, రవిప్రకాశ్‌, హర్షిణి, మాండవియ సెజల్‌, చమ్మక్‌ చంద్ర, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కేస్‌ నం.15’. తడకల వంకర్‌రాజేశ్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కేస్‌ నం.15’ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా తడకల వంకర్‌రాజేశ్‌ మాట్లాడుతూ ‘‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. సినిమాను ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఆర్‌.కె.స్వామి, సినిమాటోగ్రఫీ: ఆనమ్‌ వెంకట్‌, సంగీతం: జాన్‌.

Updated Date - Jul 10 , 2024 | 01:22 AM