భవానీ వార్డ్‌లో ఏం జరిగింది?

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:55 AM

గాయత్రీ గుప్తా, గణేశ్‌ రెడ్డి, పూజా కేంద్రే ముఖ్య పాత్రలు పోషించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘భవానీ వార్డ్‌’ ఫస్ట్‌ లుక్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటయిన ప్రెస్‌మీట్‌లో...

భవానీ వార్డ్‌లో ఏం జరిగింది?

గాయత్రీ గుప్తా, గణేశ్‌ రెడ్డి, పూజా కేంద్రే ముఖ్య పాత్రలు పోషించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘భవానీ వార్డ్‌’ ఫస్ట్‌ లుక్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటయిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు జీడీ నరసింహ మాట్లాడుతూ ‘నేను చెప్పిన కథ నచ్చి ఇందులో నటించడమే కాకుండా పూర్తి సహకారం అందించిన గాయత్రిగారికి ధన్యవాదాలు. నిర్మాత ప్రోత్సాహంతో, నటీనటుల సహకారంతో అందరికీ నచ్చేలా ఈ సినిమా తీశాను. భవానీ వార్డ్‌లో జరిగే సంఘటనలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. హారర్‌ చిత్రాలను ఇష్టపడే వారికే కాకుండా అందరినీ అలరిస్తుంది’ అన్నారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలనే ఈ సినిమా తీసినట్టు నిర్మాతల్లో ఒకరైన కల్యాణ్‌ చక్రవర్తి చెప్పారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంటుందని గాయత్రి గుప్తా చెప్పారు. హీరోగా తనకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు గణేశ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చేసినందుకు ఆనందంగా ఉందని జర్నలిస్టు సాయి సతీశ్‌ చెప్పారు.

Updated Date - Feb 28 , 2024 | 03:55 AM