ఏం జరిగింది?
ABN , Publish Date - Feb 08 , 2024 | 02:30 AM
విజయ్ శంకర్, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంతే .. అలా జరిగిపోయింది’. శ్రీరామ్ అమృతపురి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణరెడ్డి, సముద్రాల మహేశ్‌గౌడ్ నిర్మించారు...

విజయ్ శంకర్, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంతే .. అలా జరిగిపోయింది’. శ్రీరామ్ అమృతపురి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణరెడ్డి, సముద్రాల మహేశ్‌గౌడ్ నిర్మించారు. బుధవారం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిర్మాత ప్రసన్నకుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. యువతను ఆకట్టుకునే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం, ఆధ్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి జయసూర్య బొప్పెం సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మురళీమోహన్.