గరుడ పురాణం ఏం చెబుతోంది?

ABN , Publish Date - Aug 23 , 2024 | 06:22 AM

రిషి, ప్రియాంక కుమార్‌ జంటగా నటిస్తున్న తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. కే.ఎస్‌.నందీశ్‌ దర్శకత్వంలో విజయ్‌లోహిత్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు

రిషి, ప్రియాంక కుమార్‌ జంటగా నటిస్తున్న తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. కే.ఎస్‌.నందీశ్‌ దర్శకత్వంలో విజయ్‌లోహిత్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నందీశ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇదో వైవిధ్యభరితమైన సినిమా’’ అని అన్నారు. ‘‘మంచి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా అందరికీ మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ చూశామనే అనుభూతిని ఇస్తుంది’’ అని నిర్మాత విజయ్‌లోహిత్‌ చెప్పారు.

Updated Date - Aug 23 , 2024 | 06:22 AM