‘ఏం చేద్దామంటావ్‌ మరి’...

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:49 AM

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ‘మార్‌ ముంత చోడ్‌ చింత’ అనే పాటలో మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు...

కల్లు కాంపౌండ్‌ పాటలో కేసీఆర్‌ ఊతపదం

  • దర్శకుడు పూరి జగన్నాథ్‌పై కేసు నమోదు

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ‘మార్‌ ముంత చోడ్‌ చింత’ అనే పాటలో మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు వాయి్‌సను ఉపయోగించడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. కల్లు కాంపౌండ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ గీతంలో ‘ఏం చేద్దామంటావ్‌ మరి’ అనే కేసీఆర్‌ పాపులర్‌ డైలాగ్‌ను రెండుసార్లు ఉపయోగించారు. వెంటనే పాట నుంచి ఆ హుక్‌లైన్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు ఎం. రజితారెడ్డి, జీ. సతీ్‌షకుమార్‌ బుధవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ‘పదేళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌ వాయి్‌సను కల్లు కాంపౌండ్‌లో చిత్రీకరించిన ఐటమ్‌ సాంగ్‌లో ఉపయోగించడం తప్పు, ఇది కేసీఆర్‌ను అవమానించడమే కాక తెలంగాణ ప్రజల మనోభావాలనూ దెబ్బతీసేలా ఉంది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.


‘మా ప్రాంత యాస, భాష, మా నాయకుడిని కించపరిచినా సహించేది లేదు, అవసరమైతే పూరి జగన్నాథ్‌ ఇంటిని ముట్టడిస్తామ’ని బీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు. పాట రచయిత కాసర్ల శ్యామ్‌, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పైనా సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై చిత్రబృందం ఇంతవరకూ స్పందించలేదు.

Updated Date - Jul 18 , 2024 | 12:49 AM