తెలుగులోనూ హిట్‌ కొడతాం

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:54 AM

కన్నడ నటుడు, దర్శకుడు డార్లింగ్‌ కృష్ణ నటించిన ‘లవ్‌ మాక్‌ టైల్‌ 2’ ఈ శుక్రవారం విడుదల కానుంది. కన్నడంలో ఆయన నటించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు...

తెలుగులోనూ హిట్‌  కొడతాం

కన్నడ నటుడు, దర్శకుడు డార్లింగ్‌ కృష్ణ నటించిన ‘లవ్‌ మాక్‌ టైల్‌ 2’ ఈ శుక్రవారం విడుదల కానుంది. కన్నడంలో ఆయన నటించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ఎం.ఆర్‌.వి. కృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కన్నడంలో ఈ చిత్రంలో డార్లింగ్‌ కృష్ణ నటించారు. ఆయనే దర్శకుడు కూడా. ఘన విజయం సాధించిన ఆ చిత్రాన్ని తెలుగులో అనువదించాం. ఇక్కడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. మిలిన నాగరాజ్‌, అమృత అయ్యంగార్‌, రేచల్‌ డేవిడ్‌, నకుల్‌ అభయాస్కర్‌ తదితరులు ఇందులో నటించారు.

Updated Date - Jun 13 , 2024 | 04:54 AM