మ్యూజిక్‌ కంపెనీ అనుమతి తీసుకున్నాం

ABN , Publish Date - May 25 , 2024 | 06:11 AM

‘గుణ’ సినిమాలోని పాటను తమ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చిత్రంలో వాడేందుకు కాపీరైట్‌ హక్కులు పొందిన సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నట్లు నిర్మాత షాన్‌ ఆంటోని తెలిపారు.

మ్యూజిక్‌ కంపెనీ అనుమతి తీసుకున్నాం

‘గుణ’ సినిమాలోని పాటను తమ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చిత్రంలో వాడేందుకు కాపీరైట్‌ హక్కులు పొందిన సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నట్లు నిర్మాత షాన్‌ ఆంటోని తెలిపారు. అనుమతి లేకుండా తాను స్వరపరిచిన పాటలను సంగీత కచ్చేరీలు, ఇతర సినిమాల్లో ఉపయోగించడంపై అభ్యంతరం తెలుపుతూ సంగీత దర్శకుడు ఇళయరాజా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. ఆయన తాజాగా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ నిర్మాతలకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో షాన్‌ ఆంటోనీ మాట్లాడుతూ ‘కమల్‌ హాసన్‌ నటించిన ‘గుణ’ సినిమాలోని పాటకు కాపీరైట్‌ హక్కులు పొందిన రెండు మ్యూజిక్‌ కంపెనీలను సంప్రదించి, వారి నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నాం. ఆ తర్వాతే ‘మంజుమ్మెల్‌...’లో ఆ పాటను ఉపయోగించాం’ అని చెప్పారు.

Updated Date - May 25 , 2024 | 06:11 AM