మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

మైనస్‌ 30 డిగ్రీల్లో షూటింగ్‌ చేశాం

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:42 AM

‘ఈ సినిమా షూటింగ్‌ ప్రతి రోజూ సవాలే. మైనస్‌ 30 డిగ్రీల్లో వర్క్‌ చేశాం. కాళ్లు చేతులు గడ్డ కట్టేవి. ఇప్పుడు అది తలుచుకుంటే ఇంత రిస్క్‌ చేశామా అనిపిస్తుంది. ఇప్పుడు చేయమంటే మాత్రం చేయను’ అన్నారు...

మైనస్‌ 30 డిగ్రీల్లో షూటింగ్‌ చేశాం

‘ఈ సినిమా షూటింగ్‌ ప్రతి రోజూ సవాలే. మైనస్‌ 30 డిగ్రీల్లో వర్క్‌ చేశాం. కాళ్లు చేతులు గడ్డ కట్టేవి. ఇప్పుడు అది తలుచుకుంటే ఇంత రిస్క్‌ చేశామా అనిపిస్తుంది. ఇప్పుడు చేయమంటే మాత్రం చేయను’ అన్నారు హీరో విశ్వక్‌ సేన్‌. ఆయన నటించిన ‘గామి’ చిత్రం ఈ నెల ఎనిమిదిన విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ లుక్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకున్నాం. అఘోరా పాత్ర కోసం దర్శకుడు విద్యాధర్‌ ఎంతో రిసెర్చ్‌ చేశారు. మూడేళ్లు ముందుగానే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేశారు. కుంభమేళాలో కొన్ని లక్షల మంది అఘోరాలు ఉంటారు. నేనూ వాళ్లతో కలసిపోయేవాడిని. నా స్టయిల్‌లో ఎక్స్‌ప్లోర్‌ చేసుకుంటూ వెళ్లా’ అని ఆయన చెప్పారు.

దర్శకుడు విద్యాధర్‌ తను నటించిన ‘వెళ్లిపోమాకే’ సినిమా చూసి తన దగ్గరకు వచ్చాడని చెబుతూ ‘ఈ కథను సినిమాగా మలచడానికి ఐదేళ్లు పడుతుందని నాకు ముందే తెలుసు. ఒక వేళ ఏడాదిలో తీయాలనుకుంటే రూ వంద కోట్లు కావాలి. వారణాసి, కుంభమేళలో గొరిల్లా షూటింగ్‌ చేశాం. అలా బడ్జెట్‌ కలసి వచ్చింది. సమయమే దీనికి పెట్టుబడి. ఇప్పుటివరకూ ఎవరూ తీయని చిత్రమిది’ అని విశ్వక్‌ సేన్‌ చెప్పారు. ఈ సినిమాకు తను పారితోషికం తీసుకోకుండా పని చేసినట్లు ఆయన చెప్పారు. మొత్తం 70 రోజులు పని చేసినట్లు తెలిపారు. హీరోయిన్‌ చాందిని కూడా చాలా కష్టపడిందని చెప్పారు. పీసీఎక్స్‌ ఫార్మెట్‌లో ‘గామి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నామనీ, తెలుగులో ఈ ఫార్మెట్‌లో వస్తున్న తొలి చిత్రమని ఆయన తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 01:42 AM