మా గేమ్‌ను గెలిపించాలి

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:40 AM

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన ప్రీ గేమ్‌ ఈవెంట్‌లో...

మా గేమ్‌ను గెలిపించాలి

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. దయానంద్‌ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన ప్రీ గేమ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న నిర్మాత వివేక్‌ కూచిభొట్ల సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘సినిమా నేను చూశాను. మంచి కాన్సె్‌ప్టతో బాగా తీశారు. కంటెంట్‌ బాగున్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా విజయవంతం చేయాలి’ అని కోరారు. హీరో గీతానంద్‌ మాట్లాడుతూ ‘ఇది చాలా యూనిక్‌ కాన్సెప్ట్‌. తెలుగులో ఇంతవరకూ రాలేదు. రియల్‌ టైమ్‌లో సాగే సైకలాజికల్‌ గేమ్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అన్నారు. దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘ప్రతి సీన్‌ కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తూ ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాన్ని రూపొందించా. కాన్సెప్ట్‌ కొత్తగా ఆసక్తికరంగా ఉంటుంది. మా గేమ్‌ను గెలిపించాలి’ అని కోరారు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ ఫీల్‌ ఇచ్చే ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత రవి కస్తూరి చెప్పారు.

Updated Date - Jan 31 , 2024 | 01:40 AM