మా మధ్య అలాంటి సంబంధం లేదు

ABN , Publish Date - Sep 22 , 2024 | 02:37 AM

తన భార్య ఆర్తి రవికి విడాకులు ఇవ్వాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని తన తల్లిదండ్రులు అంగీకరించారని, తన సంతోషమే వారికి ముఖ్యమని హీరో ‘జయం’ రవి స్పష్టం చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘బ్రదర్‌’ సినిమా ఆడియో...

తన భార్య ఆర్తి రవికి విడాకులు ఇవ్వాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని తన తల్లిదండ్రులు అంగీకరించారని, తన సంతోషమే వారికి ముఖ్యమని హీరో ‘జయం’ రవి స్పష్టం చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘బ్రదర్‌’ సినిమా ఆడియో విడుదల వేడుక శనివారం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలాంటి గాసిప్స్‌ లేకుండా జీవితాన్ని గడిపాను. ఇపుడు నాకు, పరాయి స్త్రీకి సంబంఽధం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. గాయని కెనీషాకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఎంతోమందికి ఆమె ప్రాణం పోశారు. ఆర్తికి తెలియకుండా విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన చేశారు. విడాకుల విషయంపై రెండు సార్లు నోటీసులు పంపించాను. ఇదే విషయంపై ఆర్తి తండ్రి వచ్చి నా తల్లిదండ్రులతో చర్చించారు.


ఇంత జరిగినా తనకు తెలియకుండా తీసుకున్నట్టు చెప్పడం షాకింగ్‌కు గురిచేసింది. విడాకుల గురించి నా పెద్ద కుమారుడికి కూడా వివరించాను. అందరు పిల్లల్లాగే అతను కూడా మేమిద్దరం కలిసివుండాలని కోరాడు. నా ఇద్దరు కుమారులు నా వద్దనే ఉంటున్నారు. ఇపుడు నేను కోరేది ఒక్కటే.. ప్రైవేట్‌ లైఫ్‌ ప్రైవేట్‌ లైఫ్‌గానే ఉండనివ్వండి. గాయని కెనీషా 600కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మేమిద్దరం ఒక హీలింగ్‌ సెంటర్‌ను నెలకొల్పి అనేక మందికి సాయం చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. దాన్ని పాడు చేయవద్దు. అనవసరంగా నా గురించి, కెనీషా గురించి చెడుగా మాట్లాడవద్దు’ అని కోరారు.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 22 , 2024 | 02:37 AM