కామెడీతో వేడి పుట్టిస్తాం

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:12 AM

సుహాస్‌ హీరోగా దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ‘అందరూ మెచ్చే వినోదం ప్రారంభమవుతుంది. మీ క్యాలెండర్‌లో మే 24ని గుర్తు పెట్టుకోండి. మేం అద్భుతమైన కామెడీతో...

కామెడీతో వేడి పుట్టిస్తాం

సుహాస్‌ హీరోగా దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ‘అందరూ మెచ్చే వినోదం ప్రారంభమవుతుంది. మీ క్యాలెండర్‌లో మే 24ని గుర్తు పెట్టుకోండి. మేం అద్భుతమైన కామెడీతో వేడి పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని హీరో సుహాస్‌ వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో సుహాస్‌కి జతగా సంకీర్తన విపిన్‌ నటిస్తున్నారు. ‘సలార్‌’ చిత్రానికి డైలాగ్‌ రైటర్‌గా పని చేసిన సందీప్‌రెడ్డి బండ్ల ఈ సినిమాకు దర్శకుడు. మే 24న విడుదలయ్యే ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ను చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలిగిన ఓ ఫన్నీ కోర్టు డ్రామా చిత్రమని అర్థమవుతుంది. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌, మురళీశర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత. సమర్పణ: శిరీష్‌.

Updated Date - Mar 20 , 2024 | 06:12 AM