40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Book My Show : బుక్‌ మై షోకు ఫిర్యాదు చేశాం

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:21 AM

‘కొంతమంది కావాలనే బుక్‌ మైషోలో నకిలీ రివ్యూలు ఇచ్చి, ‘గుంటూరు కారం’ సినిమాను దెబ్బతీయాలని చూశారు. దానిపై ఆ సంస్థకు ఫిర్యాదు చేశాం. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘గుంటూరు కారం’ విజయాన్ని అడ్డుకోవాలని

‘కొంతమంది కావాలనే బుక్‌ మైషోలో నకిలీ రివ్యూలు ఇచ్చి, ‘గుంటూరు కారం’ సినిమాను దెబ్బతీయాలని చూశారు. దానిపై ఆ సంస్థకు ఫిర్యాదు చేశాం. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘గుంటూరు కారం’ విజయాన్ని అడ్డుకోవాలని కొందరు మొదటి రోజు నుంచే ‘సినిమా బాగోలేద’ని సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని చెప్పడానికి మా సినిమాకు వస్తున్న వసూళ్లే నిదర్శనం. ఆ విషయం చెప్పడానికే మీడియా ముందుకొచ్చాను’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. తొలి వారాంతానికే రూ. 200 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫీసు దగ్గర నిలకడగా కొనసాగుతోందని. నాగవంశీ మీడియాతో అనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

  • మహేశ్‌బాబు మొదట్నుంచి ఈ సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నారు. నెగెటివ్‌ రివ్యూలు వచ్చినా ఆయన ఆందోళన చెందలేదు. ‘రేపటి నుంచి ‘గుంటూరు కారం’ వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి’ అన్నారు. ఆయన అంచనాలే నిజమయ్యాయి. మహేశ్‌ ధైర్యమే ఈ స్థాయి వసూళ్లకు కారణమైందనుకుంటున్నాను.

  • ‘గుంటూరుకారం’ సినిమా కొంతమంది మీడియా వాళ్లకు లక్ష్యంగా మారింది. డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు ఫోన్‌ చేసి మరీ వసూళ్ల గురించి ఆరా తీస్తున్నారు. వాళ్లు ఎన్ని విధాలా ప్రయత్నించినా, నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చినా సినిమా ఫలితాన్ని దెబ్బతీయలేకపోయారు. రిలీజైన తొలి రోజే సోషల్‌ మీడియా ద్వారా సినిమా బాగోలేదనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ సినిమా బాగుండడంతో ప్రేక్షకులు వాటన్నింటినీ పక్కనపెట్టి అఖండ విజయాన్ని అందించారు. కుటుంబ ప్రేక్షకులకు మా సినిమా బాగా నచ్చడం వల్లే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. గతంలో మా బేనర్‌లో వచ్చిన చిత్రాలకు నెగెటివ్‌ రివ్యూ వచ్చినప్పుడు వసూళ్లు పడిపోయాయి. కానీ ఈ సారి మాత్రం వాటితో సంబంధం లేకుండా ‘గుంటూరు కారం’ భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. కొందరు కావాలనే మా సినిమాను టార్గెట్‌ చేశారనే అభిప్రాయం ఉంది.

  • దీనిని ఫ్యామిలీ సినిమాగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి ఉండాల్సింది. ఇది త్రివిక్రమ్‌ శైలిలో ఉండే ఫ్యామిలీ సినిమా అని ప్రేక్షకులకు ముందే తెలియజెప్పలేకపోయాం. దీనివల్ల ‘గుంటూరు కారం’ పక్కా మాస్‌ ఫిల్మ్‌ అని అభిమానులు అనుకున్నారు. అందువల్ల మొదట్లో కొంత నిరాశ చెందినా సర్దుకున్నారు.

Updated Date - Jan 20 , 2024 | 12:21 AM