థియేటర్లు పెంచుతున్నాం

ABN , Publish Date - May 15 , 2024 | 12:18 AM

గుంట మల్లేశం కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రహ్మచారి’. నర్సింగ్‌ దర్శకత్వం వహించగా, రామ్‌భాపాల్‌ రెడ్డి నిర్మించారు. తెలంగాణ యాసలో సాగే కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ‘బ్రహ్మచారి’ ఈ నెల...

థియేటర్లు పెంచుతున్నాం

గుంట మల్లేశం కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రహ్మచారి’. నర్సింగ్‌ దర్శకత్వం వహించగా, రామ్‌భాపాల్‌ రెడ్డి నిర్మించారు. తెలంగాణ యాసలో సాగే కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ‘బ్రహ్మచారి’ ఈ నెల 10న విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందించాం. రిలీజైన ప్రతీ చోటా విశేష ప్రేక్షకాధరణ దక్కుతోంది. పాజిటివ్‌ టాక్‌ వస్తుండడంతో ఈ సినిమాకు థియేటర్లు పెంచుతున్నాం. పెళ్లి కాని బ్రహ్మచారులు ఎదుర్కొనే సమస్యలను ఇందులో వినోదాత్మకంగా చూపించాము’’ అని చెప్పారు.

Updated Date - May 15 , 2024 | 12:18 AM