మంచి సినిమాతో వస్తున్నాం

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:28 AM

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భూతద్దం భాస్కర నారాయణ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో శివ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...

మంచి సినిమాతో వస్తున్నాం

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భూతద్దం భాస్కర నారాయణ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో శివ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘క్రైమ్‌, డిటెక్టివ్‌ థ్రిల్లర్స్‌ తెలుగులో చాలా వచ్చాయి. అందుకే ఏదో కొత్తదనం ఉంటే తప్ప అలాంటి సినిమా చేయకూడదని అనుకున్నాను. ‘భూతద్దం భాస్కర నారాయణ’ చిత్ర కథ విన్నాక కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇందులో మైథాలజీ ఎలిమెంట్‌ కూడా ఉంది. దిష్టి బొమ్మ చూస్తుంటాం. కానీ అసలు ఎందుకది అనే విషయాన్ని పట్టించుకోం. దీని గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. ఆ కథకు క్రైమ్‌, డిటెక్షన్‌ అంశాలు జోడించాం. కచ్చితంగా ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ విడుదల చేస్తుండడం మరింత బలాన్ని ఇచ్చింది’ అని చెప్పారు.

Updated Date - Mar 01 , 2024 | 06:28 AM