ఈ సినిమా ట్రైలర్‌ని పదిసార్లు చూశా

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:54 AM

‘ఈ వేదిక పై ఉన్న వాళ్లంతా ఏదో ఒక కల కని సాధించిన వాళ్లే. సుహాస్‌ గొప్పస్థాయికి వెళ్తాడని చెప్పగలను. ఇలాంటి టాలెంటెడ్‌ ఆర్టిస్టులు అరుదుగా ఉంటారు. ఈ సినిమా ట్రైలర్‌ను పదిసార్లు చూశా. అంత బాగా నచ్చింది. సినిమా పెద్ద హిట్‌ కావాలి’...

ఈ సినిమా ట్రైలర్‌ని పదిసార్లు చూశా

‘ఈ వేదిక పై ఉన్న వాళ్లంతా ఏదో ఒక కల కని సాధించిన వాళ్లే. సుహాస్‌ గొప్పస్థాయికి వెళ్తాడని చెప్పగలను. ఇలాంటి టాలెంటెడ్‌ ఆర్టిస్టులు అరుదుగా ఉంటారు. ఈ సినిమా ట్రైలర్‌ను పదిసార్లు చూశా. అంత బాగా నచ్చింది. సినిమా పెద్ద హిట్‌ కావాలి’ అని అడివి శేష్‌ ఆకాంక్షించారు. సుహాస్‌ హీరోగా నటించిన ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌’ చిత్రానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ ‘నిర్మాతగా నేను మీ ముందు నిలబడడానికి ముగ్గురు వ్యక్తులు కారణం.. అల్లు అరవింద్‌, శిరీష్‌, బన్నీవాసు. దర్శకుడు దుష్యంత్‌ ఈ సినిమా కోసం రెండేళ్లు పనిచేశాడు. ఈ చిత్రం రిలీజ్‌ అయ్యాక అతని లైఫ్‌ మారిపోతుంది. అలాగే హీరో సుహాస్‌ మరో సినిమా జోలికి పోకుండా ఏడాది పాటు ఈ మూవీ మీదే ఫోకస్‌ చేశారు’ అన్నారు. ‘నేను గీతా ఆర్ట్స్‌లో నటిస్తున్నానంటే మా పేరెంట్స్‌ నమ్మలేదు. నాకు అవకాశం ఇచ్చిన బన్ని వాసుగారికి థాంక్స్‌. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో ‘అంబాజీపేట మ్యారేజి బాండ్‌’లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చానని చెప్పగలను. దీనికి దర్శకుడు దుష్యంత్‌ డిటెయిలింగ్‌ కారణం’ అన్నారు సుహాస్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ వాసు, ఎస్‌.కె.ఎన్‌, దర్శకుడు సాయి రాజేశ్‌ తదితరులు కూడా మాట్లాడారు.

Updated Date - Feb 01 , 2024 | 02:54 AM