చిన్నతనంలోనే మార్ఫింగ్‌కి గురయ్యా..

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:03 AM

యువతరం ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్లలో జాన్వీకపూర్‌ ముందు వరుసలో ఉంటారు. ఎక్కువగా వార్తల్లో నిలిచే కథానాయికల లిస్ట్‌లో కూడా జాన్వీ ఒకరని చెప్పొచ్చు. ఇటీవల డీప్‌ ఫేక్‌ వీడియోలు...

చిన్నతనంలోనే మార్ఫింగ్‌కి గురయ్యా..

యువతరం ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్లలో జాన్వీకపూర్‌ ముందు వరుసలో ఉంటారు. ఎక్కువగా వార్తల్లో నిలిచే కథానాయికల లిస్ట్‌లో కూడా జాన్వీ ఒకరని చెప్పొచ్చు. ఇటీవల డీప్‌ ఫేక్‌ వీడియోలు హీరోయిన్లనే కాక సగటు స్త్రీలను కూడా భయపెడుతున్న తరుణంలో వాటి గురించి రీసెంట్‌గా స్పందించి చర్చనీయాంశమయ్యారు జాన్వీ. ‘ఇలాంటి అంశాల గురించి నేను పెద్దగా స్పందించను. ఎందుకంటే నేనేం మాట్లాడినా నా పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడటం, అవాకులు చవాకులు రాసేయడం చాలామందికి అలవాటైపోయింది. అందుకే సాథ్యమైనంత వరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ వచ్చాను. కానీ.. రష్మిక ఈ వీడియోలకు గురి అవ్వడం.. దానిపై ఆమె స్పందించిన తీరు, ఆ పోరాడిన విధానం నిజంగా అభినందనీయం. ఈ విషయంలో ఆమెను అభినందించకుండా ఉండలేను. నేను చిన్నతనంలోనే ఈ తరహా మార్ఫింగ్‌ వీడియోలకు గురయ్యాను. నా 15 ఏటే నా ఫేస్‌ని మార్ఫింగ్‌ చేసి వీడియోలను విడుదల చేశారు. అది చిన్న వయసు, పైగా వాటి ప్రభావం తెలీదు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవి మరీ ఎక్కువైపోయాయి. ఈ విషయంలో స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి’ అంటూ స్పందిచారు జాన్వి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తారక్‌ ‘దేవర’తో తెలుగుతెరపై సాక్షాత్కరించనున్న విషయం తెలిసిందే.

Updated Date - Jan 05 , 2024 | 07:03 AM