హిస్టారికల్‌ బ్యాక్‌డ్రా్‌పలో వారియర్‌ స్టోరీ

ABN , Publish Date - Aug 18 , 2024 | 01:36 AM

ప్రభాస్‌ కొత్త చిత్రం శనివారం ఉదయం మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అధినేతలు నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ వై నిర్మిస్తున్నారు. ఇన్‌స్టాలో తన వీడియాలతో అందరినీ ఆకట్టుకొన్న...

ప్రభాస్‌ కొత్త చిత్రం శనివారం ఉదయం మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అధినేతలు నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ వై నిర్మిస్తున్నారు. ఇన్‌స్టాలో తన వీడియాలతో అందరినీ ఆకట్టుకొన్న ఇమాన్వీ ఎస్మాయిల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీత శ్లోకాన్ని ప్రచురించారు. ‘ఆపరేషన్‌ జెడ్‌’ అని మరొక చోట పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా క్లాప్‌ బోర్డ్‌ మీద కోల్‌కతా హౌరా బ్రిడ్జ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ పతాకం, చార్మినార్‌.. ఉండడం ఆసక్తిరేకెత్తిస్తోంది. 1940 బ్యాక్‌డ్రా్‌పలో జరిగే ఈ చిత్రకథలో ప్రభాస్‌ వారియర్‌గా ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. మిథున్‌ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఫొటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

Updated Date - Aug 18 , 2024 | 01:36 AM