మళ్లీ రావాలనుకుంటున్నా

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:38 AM

‘పెళ్లాం ఊరెళితే’, ‘ఇంద్ర’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన ప్రశాంతి హారతి ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్న ప్రశాంతి హారతి మీడియాతో ముచ్చటించారు...

మళ్లీ రావాలనుకుంటున్నా

‘పెళ్లాం ఊరెళితే’, ‘ఇంద్ర’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన ప్రశాంతి హారతి ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్న ప్రశాంతి హారతి మీడియాతో ముచ్చటించారు.

‘‘నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్‌ అంటే ఇష్టం. కూచిపూడి నేర్చుకున్నాను. కొన్ని ఫొటోషూట్స్‌ చేశాను. అవి చూసి కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలా శ్రీనివాసరెడ్డి డైరెక్ట్‌ చేసిన ‘ఫిబ్రవరి 14 నెక్లెస్‌ రోడ్‌’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టాను. ఆ తర్వాత మణిశర్మ నిర్మించిన ‘రూపాయి’ చిత్రంలోనూ నటించాను. ‘ఇంద్ర’, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాలు నటిగా నాకు మంచి గుర్తింపు ఇచ్చాయి. పెళ్లయ్యాక మా వారితో యూఎస్‌ వెళ్లాను. అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించాను. మన నృత్యరూపకాలు రేపటి తరానికి కూడా అందాలనేది నా కోరిక. మా పాప తాన్యతో ‘తెలుగింటి సంస్కృతి’ మ్యూజిక్‌ వీడియో రూపొందించాం. తాన్యకు ఇప్పుడు 16 ఏళ్లు. తన ఏజ్‌ కు తగిన మంచి అవకాశం వస్తే తనను కూడా సినిమా ఇండస్ర్టీకి పంపేందుకు మా ఫ్యామిలీకి అభ్యంతరం లేదు. నేను యాక్టింగ్‌ కోర్సులు నేర్చుకోలేదు. అయితే క్లాసికల్‌ డ్యాన్సర్‌ను కాబట్టి నటిగా భావోద్వేగాలు పలికించడం తేలికయ్యేది. ఈ ఆత్మవిశ్వాసంతోనే సినిమాలు, సీరియల్స్‌ చేశాను. వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీల వల్ల ఎంతో మంది నటీనటులకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలు చూసే మళ్లీ టాలీవుడ్‌కు రావాలనుకుంటున్నా’’ అని చెప్పారు.

Updated Date - Mar 27 , 2024 | 01:38 AM