ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా

ABN , Publish Date - May 21 , 2024 | 06:14 AM

‘బేబి’తో సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘గం గం గణేశా’. ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు..

ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా

‘బేబి’తో సూపర్‌ హిట్‌ కొట్టిన తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘గం గం గణేశా’. ఈ యాక్షన్‌ ఎంటర్టైనర్‌కు ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. కేదార్‌ శెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. మే 31న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రచయిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. సినిమా దర్శకుడు ఉదయ్‌ శెట్టి మాట్లాడుతూ ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాని రూపొందించాం. వినోదంతో పాటు ఇందులోని ట్విస్ట్‌లు, థ్రిల్‌లు ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు. ‘‘నేను ఇప్పటిదాకా రియలిస్టిక్‌ పాత్రలు పోషించాను. ఈ సినిమాలో నా పాత్ర ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇది టిపికల్‌ క్రైమ్‌ కామెడీ జానర్‌’’ అని ఆనంద్‌ దేవరకొండ అన్నారు. ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిశోర్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యూయల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి, సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌, సహ నిర్మాత: అనురాగ్‌ పర్వతనేని.

Updated Date - May 21 , 2024 | 06:14 AM