నిరీక్షణ ఎవరికోసమో!

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:12 AM

పికాక్‌ మూవీ బ్యానర్‌పై సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో నిర్మాత పి.సంతో్‌షరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నా నిరీక్షణ’. అమర్‌ దీప్‌, లిషి గణేష్‌ కల్లపు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన...

పికాక్‌ మూవీ బ్యానర్‌పై సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో నిర్మాత పి.సంతో్‌షరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నా నిరీక్షణ’. అమర్‌ దీప్‌, లిషి గణేష్‌ కల్లపు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాతలు దిల్‌ రాజు, సురేష్‌ బాబుతోపాటు రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డైరెక్టర్‌ సాయి వర్మ దాట్ల మాట్లాడుతూ.. ‘సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను కానీ ఓ మంచి చిత్రాన్ని అయితే తీస్తున్నాను’ అని తెలిపారు. అమర్‌ దీప్‌ మాట్లాడుతూ.. ‘హీరోగా ఇది నా రెండో చిత్రం. బిగ్‌ బాస్‌ తరవాత సెలెక్ట్‌ చేసుకున్న ఫస్ట్‌ స్ర్కిప్ట్‌ ఇది’ అని అన్నారు. కాగా, ఈ సినిమాకు శేఖర్‌ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Updated Date - Oct 16 , 2024 | 06:12 AM