విజువల్‌గా.. మ్యూజికల్‌గా...

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:44 AM

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపుదిద్దుకుంటున్న ‘తండేల్‌’ చిత్రం వైజాగ్‌, శ్రీకాకుళం షెడ్యూల్‌ శనివారంతో పూర్తయింది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న...

విజువల్‌గా.. మ్యూజికల్‌గా...

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపుదిద్దుకుంటున్న ‘తండేల్‌’ చిత్రం వైజాగ్‌, శ్రీకాకుళం షెడ్యూల్‌ శనివారంతో పూర్తయింది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లతో పాటు ఇతర నటీనటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. పాత్రల గెటప్‌, కాస్ట్యూమ్స్‌, బాడీ లాంగ్వేజ్‌, యాస ప్రామాణికంగా ఉండేలా దర్శకుడు చందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాస్తవ సంఘటనల ప్రేరణతో ఓ ప్రేమ కథగా ‘తండేల్‌’ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విజువల్‌గా, మ్యూజికల్‌గా ఎంతో అద్భుతంగా ఉండేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: షామ్‌దత్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి.

Updated Date - Jun 23 , 2024 | 06:44 AM