ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులకు విశ్వనాథ్‌ అవార్డ్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:33 AM

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. అక్కినేని నటించిన ఎన్నో చిత్రాలకు విశ్వనాథ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అంతేకాదు ఏయన్నార్‌ నటించిన ‘ఆత్మగౌరవం’.....

ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులకు విశ్వనాథ్‌ అవార్డ్‌

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. అక్కినేని నటించిన ఎన్నో చిత్రాలకు విశ్వనాథ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అంతేకాదు ఏయన్నార్‌ నటించిన ‘ఆత్మగౌరవం’ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. వీరిద్దరి అనుబంధాన్ని స్మరించుకుంటూ అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాలో ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థులకు ప్రతి ఏడాది రెండు నగదు అవార్డులను ఇవ్వాలని విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని విగ్రహం దగ్గర నాగార్జున, అమలతో విశ్వనాథ్‌ తనయుడు నాగేంద్ర తన భార్య లక్ష్మి, కుమారుడు ప్రణవ్‌ కలసి సమావేశమై ఈ నిర్ణయం ప్రకటించారు. విశ్వనాథ్‌ సౌండ్‌ రికార్డి్‌స్టగా కెరీర్‌ ప్రారంభించి, తర్వాత దర్శకుడు అయ్యారు కనుక ఆయన పేరిట సౌండ్‌ డిజైన్‌, డైరెక్షన్‌ రంగాల్లో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఇద్దరు విద్యార్థులకు ఇకపై ప్రతి ఏడాది చెరో పాతిక వేల రూపాయలు అవార్డ్‌ రూపంలో అందజేస్తారు.

Updated Date - Feb 20 , 2024 | 05:33 AM