డబ్బింగ్‌ పనుల్లో విశ్వంభర

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:55 AM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘విశ్వంభర’. ఈ ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌కు ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు...

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘విశ్వంభర’. ఈ ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌కు ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయి. అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్‌తో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో హనుమంతుడి భక్తుడిగా చిరంజీవి కనిపించనున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీఓపీ: చోటా.కె.నాయుడు, సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి.

Updated Date - Jul 05 , 2024 | 12:55 AM