లైలా కోసం కలం పట్టిన విశ్వక్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:47 AM

విశ్వక్‌ సేన్‌ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లైలా’. ఇందులో ఆయన లేడీ గెట్‌పలో నటిస్తుండడం ఓ విశేషమైతే.. ఇప్పుడు ఈ సినిమా కోసం కలం పట్టి పాట రాయడం...

విశ్వక్‌ సేన్‌ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లైలా’. ఇందులో ఆయన లేడీ గెట్‌పలో నటిస్తుండడం ఓ విశేషమైతే.. ఇప్పుడు ఈ సినిమా కోసం కలం పట్టి పాట రాయడం మరో విశేషం. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేశారు. ‘మోడల్‌ మోడల్‌ సోనూ మోడల్‌’ అంటూ సాగే ఈ పాటలో విశ్వక్‌ అమ్మాయిల మనసులను ఎలా గెలిచాడో ఆసక్తికరంగా చూపించారు. విశ్వక్‌ సేన్‌ రాసిన ఈ పాటను నారాయణ్‌ రవిశంకర్‌, రేష్మ శ్యామ్‌ ఆలపించారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించారు.

Updated Date - Dec 31 , 2024 | 01:47 AM