వీర ధీర శూరుడు

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:43 AM

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడు విక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 62వ చిత్రం టైటిల్‌ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. తమిళంలో ఈ సినిమాకు ‘వీర ధీర శూరన్‌’...

వీర ధీర శూరుడు

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడు విక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 62వ చిత్రం టైటిల్‌ టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. తమిళంలో ఈ సినిమాకు ‘వీర ధీర శూరన్‌’ అనే పేరు నిర్ణయించారు. టైటిల్‌ టీజర్‌ విడుదల చేశారు. తెలుగు టైటిల్‌ త్వరలో ప్రకటిస్తారు. ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య, దుసరా విజయన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ పక్కా మాస్‌ పాత్ర పోషిస్తున్నట్లు 225 సెకన్లు ఉన్న టైటిల్‌ టీజర్‌ చెప్పకనే చెప్పింది. ఇందులో కిరాణా షాప్‌ ఓనర్‌ కాళీ పాత్రను ఆయన పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తున్నారు.

తంగలాన్‌ గ్లింప్స్‌

విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’ స్పెషల్‌ గ్లింప్స్‌ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. సినిమా కోసం విక్రమ్‌ ఎంత కష్టపడ్డారో ఈ గ్లింప్స్‌ చూపించింది. ఈ సినిమా గురించి దర్శకుడు పా. రంజిత్‌ మాట్లాడుతూ ‘చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల నేపథ్యంలో అడ్వెంచర్‌ మూవీగా ‘తంగలాన్‌’ను అందిస్తున్నాం. విక్రమ్‌తో పాటు టీమ్‌ కూడా నాకు ఎంతో సహకరించింది. ప్రముఖ ప్రొడక్షన్‌ కంపెనీ జియో స్టూడియోస్‌ మా సినిమా కోసం స్టూడియో గ్రీన్‌తో చేతులు కలపడం ఆనందంగా ఉంది’ అన్నారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ‘తంగలాన్‌’ను విడుదల చేస్తామని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చెప్పారు.

Updated Date - Apr 18 , 2024 | 06:43 AM