వింటేజ్‌ నరేశ్‌ని మళ్లీ చూస్తారు

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:44 AM

అల్లరి నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం టీజర్‌ను మంగళవారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్‌ చిలక ఈ సినిమా నిర్మిస్తున్నారు...

వింటేజ్‌ నరేశ్‌ని మళ్లీ చూస్తారు

అల్లరి నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం టీజర్‌ను మంగళవారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్‌ చిలక ఈ సినిమా నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదల కానుంది. టీజర్‌ను విడుదల చేసిన అనంతరం నరేశ్‌ మాట్లాడుతూ ‘నాన్నగారు తీసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రానికీ, మా సినిమాకూ పోలిక లేదు. జీవితంలో సెటిల్‌ కాకుండా పెళ్లి చేసుకొనే హీరో కథతో నాన్నగారి సినిమా ఉంటుంది. లైప్‌లో సెటిల్‌ అయినా పెళ్లికాని వాడి కథ మాది. చాలా హిలేరియ్‌సగా ఉంటుంది. వింటేజ్‌ నరేశ్‌ రావాలని చాలా మంది అడుగుతున్నారు. నా బలం కామెడీ. అందుకే ఈసారి మరింత నవ్వించాలని ఈ సినిమా చేశాం. ఫరియా మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న నటి. అద్భుతంగా నటించింది. హిందీ నటుడు జానీ లివర్‌ తొలిసారిగా తెలుగులో నటిస్తున్నారు. నిర్మాణానికి కొత్త అయినా రాజీవ్‌గారు మంచి ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రమిది’ అన్నారు. ‘మా బేనర్‌ చిలకా ప్రొడక్షన్స్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. నిర్మాత కావాలనే నా ఇరవై ఏళ్ల కల ఈ సినిమాతో తీరింది. నరేశ్‌ మంచి నటుడు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’ అన్నారు నిర్మాత రాజీవ్‌ చిలక. ‘టీజర్‌ చూసి ఎలా నవ్వుకుంటున్నారో సినిమా కూడా అంతే వినోదభరితంగా ఉంటుంది. ఫ్యామిలీతో కలసి ఆనందంగా నవ్వుకుంటూ చూసే సినిమా ఇది’ అని చెప్పారు దర్శకుడు. నరేశ్‌తో ఇది నాలుగో సినిమా, డైలాగులు రాస్తున్నప్పుడు కిక్‌ వచ్చిందని రచయిత అబ్బూరి రవి తెలిపారు.

Updated Date - Mar 13 , 2024 | 03:44 AM