విశ్వంభర సెట్‌కు వినాయక్‌

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:02 AM

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. దర్శకుడు వి.వి.వినాయక్‌ సోమవారం ఈ నెట్‌కు వెళ్లారు...

విశ్వంభర సెట్‌కు వినాయక్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. దర్శకుడు వి.వి.వినాయక్‌ సోమవారం ఈ నెట్‌కు వెళ్లారు. మెగాస్టార్‌ చిరంజీవిని కలసి కాసేపు ముచ్చటించారు. ఆయనతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. దర్శకుడు వశిష్టకు, చిత్ర నిర్మాతలకు అభనందనలు తెలిపారు వినాయక్‌. మెగాస్టార్‌ చిరంజీవి, వినాయక్‌, వశిష్ట కలసి ఉన్న ఫొటోని చిత్రం టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘విశ్వంభర’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌, నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 01:02 AM