పల్లెటూరి యువతి ప్రతీకారం

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:31 AM

యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అంజలి ప్రధాన పాత్ర పోషించిన వెబ్‌ సెరీస్‌ ‘బహిష్కరణ’ ఈ నెల 19న ఓటీటీ వేదిక జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది....

యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అంజలి ప్రధాన పాత్ర పోషించిన వెబ్‌ సెరీస్‌ ‘బహిష్కరణ’ ఈ నెల 19న ఓటీటీ వేదిక జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది. ముఖేశ్‌ ప్రజాపతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ విలేజ్‌ రివెంజ్‌ డ్రామా ఆరు ఎపిసోడ్స్‌గా ప్రసారం అవుతుంది. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. పల్లెటూరు, అక్కడ అంజలి, శ్రీతేజ్‌, అనన్య నాగళ్ల పాత్రల పరిచయం, ఊరి పెద్ద చేసే దురాగతాలు ట్రైలర్‌లో చూపించారు. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మరో వైపు ప్రతీకారం తీర్చుకోవడం కోసం రగిలిపోయే పల్లెటూరి యువతి పాత్రను అంజలి పోషించారు. ఇందులో ఊరి పెద్దగా రవీంద్రన్‌ విజయ్‌ నటించారు. ప్రశాంతి మలిశెట్టి నిర్మించిన ‘బహిష్కరణ’ సిరీస్‌కు ప్రసన్నకుమార్‌ సినిమాటోగ్రఫీని, సిద్ధార్ఠ్‌ సదాశివుని సంగీతాన్ని అందించారు.

Updated Date - Jul 11 , 2024 | 04:31 AM