విక్రమ్‌ చిత్రంలో విలన్‌గా

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:31 AM

తమిళ హీరో విక్రమ్‌ కథానాయకుడిగా ఎస్‌. యూ అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీర ధీర శూరన్‌’. రియా శిబు నిర్మిస్తున్నారు. హీరోగా విక్రమ్‌కు ఇది 62వ చిత్రం...

విక్రమ్‌ చిత్రంలో విలన్‌గా

తమిళ హీరో విక్రమ్‌ కథానాయకుడిగా ఎస్‌. యూ అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీర ధీర శూరన్‌’. రియా శిబు నిర్మిస్తున్నారు. హీరోగా విక్రమ్‌కు ఇది 62వ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. విక్రమ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రబృందం మరో అప్డేట్‌ను వదిలింది. మలయాళ నటుడు సిద్దిఖీ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆదివారం యూనిట్‌ తెలిపింది. గతంలో ఆయన ‘అంతిమ తీర్పు, అగ్ని నక్షత్రం, నా బంగారు తల్లి’ చిత్రాల్లో నటించారు. కాళి అనే కిరాణా షాపు యజమాని పాత్రలో విక్రమ్‌ కనిపించనున్నారు. ఎస్‌జే సూర్య, దుసరా విజయన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్‌.

Updated Date - Apr 22 , 2024 | 04:31 AM