Vijay Polaki Master : నాదైన ముద్ర కోసం తపిస్తా

ABN, Publish Date - Dec 22 , 2024 | 07:05 AM

‘ప్రతి పాటను ఒక సవాల్‌గా తీసుకొని కొరియోగ్రఫీ చేస్తాను. పనిలో నాదైన ముద్ర ఉండాలని తపిస్తాను. దానివల్లే ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది’ అని

‘ప్రతి పాటను ఒక సవాల్‌గా తీసుకొని కొరియోగ్రఫీ చేస్తాను. పనిలో నాదైన ముద్ర ఉండాలని తపిస్తాను. దానివల్లే ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది’ అని విజయ్‌ పోలాకి మాస్టర్‌ అన్నారు. టాలీవుడ్‌లో పలువురు అగ్రహీరోల సినిమాలకు డాన్స్‌ మాస్టర్‌గా పనిచేస్తూ బిజీగా ఉన్న విజయ్‌ పోలాకి తన సినీ ప్రయాణం గురించి మీడియాతో మాట్లాడారు. ‘కెరీర్‌ ఆరంభంలో డాన్స్‌ మాస్టర్‌గా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. నా వీడియోలు చూసిన హీరో రామ్‌ పోతినేని ప్రోత్సహించారు. చాలా సినిమాలకు కొరియోగ్రఫీ చేసినా తొలిసారి ప్రేక్షకులు, ఇండస్ట్రీలో గుర్తింపు దక్కింది మాత్రం ‘పలాస’ చిత్రంలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాటతోనే. ఆ తర్వాత హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావా’ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు. ‘పుష్ప 2’ చిత్రంలో టైటిల్‌ సాంగ్‌, జాతర పాటకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పంద న చాలా సంతృప్తినిచ్చింది. ఈ సినిమా నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది’ అని అన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 07:05 AM