Vijay deverakonda : హోలీ అంటే భయపడేవాణ్ణి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:26 AM

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం నుంచి థర్డ్‌ సింగిల్‌ ‘మధురం కదా’ విడుదలైంది. సోమవారం హోలీ వేడుకల్లో గ్రాండ్‌గా జరిగిన కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. మూవీ టీమ్‌తో హోలీ ఆడుతూ...

Vijay deverakonda : హోలీ అంటే భయపడేవాణ్ణి

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం నుంచి థర్డ్‌ సింగిల్‌ ‘మధురం కదా’ విడుదలైంది. సోమవారం హోలీ వేడుకల్లో గ్రాండ్‌గా జరిగిన కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. మూవీ టీమ్‌తో హోలీ ఆడుతూ కలసి డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ ‘తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ మొదట విజయ్‌ విన్నాడు. నాకు ఫోన్‌ చేసి పరశురామ్‌ మంచి కథ చెప్పాడు. మీరు వింటారా? అని అడిగారు. నేను ఆ కథ విని 15 నిముషాల్లో ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇది మిడిల్‌ క్లాస్‌ కథ. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నట్లుగా సినిమా ఉంటుంది. ఏప్రిల్‌ 5న ఫ్యామిలీస్‌ సినిమా చూడడానికి రండి’ అన్నారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘చదువుకొనే రోజుల్లో హోలీ అంటే రంగులు పూస్తారని, అవి అలాగే ఉంటాయనీ భయపడేవాణ్ణి. అదే టైమ్‌లో ఎగ్జామ్స్‌ జరుగుతుంటే చాలా మంది ముఖాల నిండా రంగులతో వచ్చే వారు. కానీ ఇప్పుడు ఇక్కడ మీ అందరితో కలసి హోలి సెలబ్రేట్‌ చేసుకుంటుంటే పండగంటే ఇలాగే ఉండాలనిపిస్తోంది. మనలాంటి ఫ్యామిలీస్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కథ మా సినిమా. మీరు బాగా ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు. ‘ఎప్పుడూ హోలీ పండుగను ముంబైలో చేసుకుంటూ ఉంటాను. ఈసారి మీ మధ్య ‘ఫ్యామిలీ స్టార్‌’ టీమ్‌తో కలసి సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది’ అని మృణాల్‌ ఠాకూర్‌ అన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:26 AM