Family Star: హోళీ పండగ అంటేనే భయపడేవాడిని, ఎందుకో తెలుసా: విజయ్ దేవరకొండ

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:22 PM

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తమ సినిమా 'ఫ్యామిలీ స్టార్' సినిమా కోసం హైదరాబాదు నగరంలో వున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ కి వెళ్లి అక్కడ వున్న వారందరితో సందడి చేశారు. సినిమాలో ఒక పాట కూడా అక్కడే లాంచ్ చేశారు. నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

Family Star: హోళీ పండగ అంటేనే భయపడేవాడిని, ఎందుకో తెలుసా: విజయ్ దేవరకొండ
Vijay Deverakonda, Mrunal Thakur and Dil Raju at a gated community promoting thier film Family Star

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' ప్రచారాలు జోరుమీదున్నాయి. ఈ సినిమాకి దిల్ రాజు, శిరీష్ నిల్ నిర్మాతలు కాగా పరశురామ్ దర్శకుడు. ఈరోజు హోళీ సందర్భంగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ పాటని 'మధురము కదా..' హైదరాబాద్ లోని మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో హోలీ వేడుకల మధ్య గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సినిమా ప్రధాన జంట విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. 'ఫ్యామిలీ స్టార్' సినిమా టీమ్ కు మై హోమ్ జెవెల్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి వెల్ కమ్ చెప్పారు.

vijaydmrunalthakur.jpg

ఆ కమ్యూనిటీలో వుండే అందరితో పాటుగా ఈ సినిమా సభ్యులు కూడా డ్యాన్సులు చేస్తూ, ఫొటోస్ తీసుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మా సినిమా టీమ్ కు వెల్ కమ్ చెప్పిన మీ ఫ్యామిలీస్ అందరికీ థ్యాంక్స్. ఏప్రిల్ 5న మా సినిమా విడుదలవుతోంది, ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ మొదట విజయ్ విన్నాడు. నాకు ఫోన్ చేసి పరశురామ్ మంచి స్టోరీ చెప్పాడు మీరు వింటారా అని అడిగాడు. నేను కథ విన్నాక 15 నిమిషాల్లో ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కథ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎమోషన్స్ అన్నీ విజయ్ క్యారెక్టర్ లో చూస్తారు. పాటలు, డైలాగ్స్, హీరోతో చెప్పించిన మానరిజమ్స్ అన్నీ రేపు థియేటర్స్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లు ఉంటుంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా మా సినిమా చూసేందుకు థియేటర్స్ కు పరుగులు పెడతారు. అన్నారు.

vijaydmrunal.jpg

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, నేను చదువుకునే రోజుల్లో హోళీ పండుగ అంటే భయపడేవాడిని. రంగులు పూస్తారు, అవి అలాగే ఉండిపోతాయని ఇంట్లోనే ఉండిపోయేవాడిని. అదే టైమ్ లో పరీక్షలు జరుగుతుంటే చాలా మంది మొహం నిండా రంగులతో వచ్చేవారు. కానీ ఇక్కడ మీ అందరితో కలిసి హోళీ జరుపుకుంటుంటే, పండుగంటే ఇలా ఉండాలని అనిపిస్తోంది. మీ అందరి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్లు ఉన్నాయి. ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' సినిమా చూసేందుకు థియేటర్స్ కు రండి. మన లాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక పర్సన్ కథ ఇది. ఫ్యామిలీ గురించి ఆలోచించే వారి కథ. థియేటర్స్ లో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ హోళీ పండుగను ముంబైలో చేసుకుంటూ ఉంటాను అని అంటూ, ఈసారి మీ మధ్య 'ఫ్యామిలీ స్టార్' సినిమా టీమ్ తో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు.

Updated Date - Mar 25 , 2024 | 03:23 PM