Vijay Deverakonda: అభిమానుల‌కు.. ఫ్యామిలీ స్టార్ గుడ్‌న్యూస్‌! విజ‌య్ దేవ‌ర‌కొండ పోస్టు వైర‌ల్

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:10 PM

విజ‌య్ దేవ‌ర‌కొండ, మృణాల్ ఠాకూర్ జంట‌గా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ ఈ ఏడాది సంక్రాంతికే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ సినిమా వాయిదాప‌డ్డ సంగ‌తి తెల్సిందే. ఈక్ర‌మంలో తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో ఆప్డేట్ రానున్న‌ట్లు స‌మాచారం.

Vijay Deverakonda: అభిమానుల‌కు.. ఫ్యామిలీ స్టార్ గుడ్‌న్యూస్‌! విజ‌య్ దేవ‌ర‌కొండ పోస్టు వైర‌ల్
family star

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంట‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) పతాకంపై ప‌ర‌శురాం (Parasuram) ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌ రాజు (Dil Raju), శిరీష్‌ నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). ఈ ఏడాది సంక్రాంతికే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ సినిమా వాయిదాప‌డ్డ సంగ‌తి తెల్సిందే. ఏప్రిల్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న క్ర‌మంలో చిత్రం ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌కు సినిమా యూనిట్ న‌డుం బిగించింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లిమ్స్‌, ఓ పాటకు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.

GHh6Xw_bAAE57_e.jpeg

ఈక్ర‌మంలో తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో ఆప్డేట్ రానున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే టీజ‌ర్ రాబోతుందంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో పోస్టు చేయ‌డంతో ఈ వార్త బాగా వైర‌ల్ అవుతోంది. శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఈ టీజ‌ర్ రిలీజ్ చేయనున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా టీజ‌ర్ గురించే విజ‌య్ ఆ పోస్టు పెట్టాడంటూ అభిమానులు చ‌ర్చిచుకుంటున్నారు. విజ‌య్, ప‌ర‌శురాం కాంబినేస‌న్‌లో గీతాగోవిందం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో రానున్న ఫ్యామిలీస్టార్ పైన అంచ‌నాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.


ఇదిలాఉండ‌గా ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో ఐదు సినిమాలును లైన్‌లో పెట్ట‌గా అవ‌న్నీ పేరున్న ద‌ర్శ‌కులు, ప్రోడ‌క్ష‌న్ హౌజ్‌లు కావ‌డం గ‌మ‌నార్హం. ముందుగా జెర్సీ ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో కాంబినేష‌న్‌లో ఓ సినిమా, కెప్టెన్ మిల్ల‌ర్ ఫేం అరుణ్ మాథేశ్వ‌ర‌న్, రాజా వారు రాణి గారు ఫేం ర‌వి కిర‌ణ్ కోలా, క‌న్న‌డ ముప్తీ ఫేం నార్త‌న్ వంటి ద‌ర్శ‌కుల చిత్రాల‌లో న‌టించ‌నున్నాడు. వీటిలో శ్రీలీల (Sree leela), విక్ర‌మ్ నాన్న ఫేం సారా అర్జున్ (Sara Arjun) వంటి క‌థానాయికలు న‌టించ‌నున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 04:10 PM