లవ్‌గురుగా విజయ్‌ ఆంటోనీ

ABN , Publish Date - Mar 17 , 2024 | 05:17 AM

తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో నటిస్తున్న సినిమా ‘లవ్‌గురు’. మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకుడు, రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్‌ 11న...

లవ్‌గురుగా విజయ్‌ ఆంటోనీ

తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో నటిస్తున్న సినిమా ‘లవ్‌గురు’. మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకుడు, రంజాన్‌ సందర్భంగా ఏప్రిల్‌ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ ‘అమ్మాయిలను హ్యాండిల్‌ చేయడం అబ్బాయిలకు పెద్ద సమస్య. ఈ సినిమాలో నేను లవ్‌గురుగా కొన్ని టిప్స్‌ చెబుతుంటాను. అలాగే నేను ప్రేమించిన యువతితో ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించానన్నది వినోదభరితంగా చూపించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 500కి పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు. ‘బిచ్చగాడు’ చిత్రం తర్వాత విజయ్‌కి అంత పేరు తెచ్చే సినిమా ఇదని దర్శకుడు వినాయక్‌ చెప్పారు. హీరోయిన్‌ మృణాళిని మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను లీల అనే పాత్ర పోషించాను. అందులో పర్‌ఫెక్ట్‌గా నటించడం కోసం కలైరాణి దగ్గర ట్రైనింగ్‌ తీసుకున్నాను’ అన్నారు.

Updated Date - Mar 17 , 2024 | 05:17 AM