విక్టరీ వెంకటేశ్‌ కొత్త చిత్రం

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:24 AM

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌తో ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ వంటి వినోదాత్మక చిత్రాలను అందించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి తాజాగా ఇప్పుడు వెంకటేశ్‌ సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నారు...

విక్టరీ వెంకటేశ్‌ కొత్త చిత్రం

విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌తో ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ వంటి వినోదాత్మక చిత్రాలను అందించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి తాజాగా ఇప్పుడు వెంకటేశ్‌ సోలో హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించే ఈ చిత్రం బుధవారం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఉన్న రివాల్వర్‌, గులాబీ పువ్వు, ఎక్సలెంట్‌ వైఫ్‌, ఎక్స్‌ కాప్‌, ఎక్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అనే కాప్షన్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. దీనిని బట్టి చూస్తే ఇందులో వెంకటేశ్‌ మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నారనీ, ఆ ఆఫీసర్‌గారి భార్య, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు అనిల్‌ రావిపూడి స్కూల్‌లో లా వినోదభరితంగా ఉండవచ్చని అర్థమవుతుంది.

Updated Date - Jul 02 , 2024 | 12:24 AM