హైదరాబాద్‌లో వేట్టయాన్‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:22 AM

ఇటీవలే ‘లాల్‌ సలామ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్‌ తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వేట్టయాన్‌’ షూటింగ్‌లో...

హైదరాబాద్‌లో వేట్టయాన్‌

ఇటీవలే ‘లాల్‌ సలామ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్‌ తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వేట్టయాన్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆదివారమే నగరానికి చేరుకున్న రజనీకాంత్‌ ఓ ప్రైవేట్‌ స్టూడియోలో షూటింగ్‌లో పాల్గొన్నారు. మరికొన్ని రోజుల పాటు రజనీకాంత్‌ చిత్రీకరణలో పాల్గొంటారు. ‘వేట్టయాన్‌’ చిత్రానికి టీజే జ్ఞానవేల్‌ దర్శకుడు. అమితాబ్‌బచ్చన్‌, రానా, ఫహాద్‌ ఫాజిల్‌, మంజు వారియర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్‌ నిర్మాత.

Updated Date - Mar 12 , 2024 | 05:22 AM