వరాలు అందరికీ నచ్చుతుంది..

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:12 AM

‘ఇందులో నాపేరు వరాలు. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిని. పల్లెటూరి అమ్మాయిలంటే సాధారణంగా సున్నితంగా ఉంటారు. కానీ నేను మాత్రం ఇందులో రెబల్‌. సినిమా చూసినవాళ్లు ‘అమ్మాయి అంటే ఇలా ఉండాలి’...

వరాలు అందరికీ నచ్చుతుంది..

‘ఇందులో నాపేరు వరాలు. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిని. పల్లెటూరి అమ్మాయిలంటే సాధారణంగా సున్నితంగా ఉంటారు. కానీ నేను మాత్రం ఇందులో రెబల్‌. సినిమా చూసినవాళ్లు ‘అమ్మాయి అంటే ఇలా ఉండాలి’ అనేలా నా పాత్ర ఉంటుంది’ అని అషిక రంగనాథ్‌ అన్నారు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించిన ‘నా సామిరంగ’ చిత్రంలో అషిక కథానాయికగా నటించారు. జనవరి 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో ముచ్చటించారు. ‘నాలాంటి కొత్తమ్మాయికి నాగార్జునగారి లాంటి టాప్‌స్టార్‌తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం. నా కేరక్టర్‌లో రెండు కోణాలుంటాయి. కొంతభాగం యంగ్‌స్టర్‌గా, కొంతభాగం ప్రౌఢగా కనిపిస్తాను. నటనలోనే కాదు, ఆహార్యంలో కూడా తేడా ఉంటుంది. కష్టపడి చేశాను. ఇంత అద్భుతమైన పాత్ర దక్కడం నా అదృష్టం.’ అంటూ ఆనందం వెలిబుచ్చారు అషిక. కథానుగుణంగా నాగార్జున పాత్రకూ, తన పాత్రకూ మధ్య అద్భుతమైన లవ్‌ట్రాక్‌ ఉంటుందని, రొమాంటిక్‌ సన్నివేశాలను కూడా అందంగా దర్శకుడు తీర్చిదిద్దారని అషిక చెప్పారు. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ పాత్రలు కూడా కథలో కీలకంగా ఉంటాయని, వారి కాంబినేషన్‌లో వచ్చే తన సీన్స్‌ చక్కని వినోదాన్ని పంచుతాయని అషిక తెలిపారు. ఎం.ఎం.కీరవాణి లాంటి గ్రేట్‌ టెక్నీషియన్‌ పనిచేస్తున్న చిత్రంలో భాగమవ్వడం పట్ల అషిక సంతోషం వ్యక్తం చేశారు. వేగం, క్లారిటీ ఈ రెండూ దర్శకుడు విజయ్‌ బిన్నీకి ఆభరణాలని, అనుభవం ఉన్న దర్శకుడిగా వండర్‌ అనిపించేలా సినిమాను తీర్చిదిద్దాడని, నిర్మాత శ్రీనివాస్‌ సహకారం వల్లే ఇంత అద్భుతమైన ప్రొడక్ట్‌ తయారైందని ఆమె పేర్కొన్నారు. తమిళంలో సిద్దార్థ్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రంతోపాటు కన్నడలో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్టు ఈ సందర్భంగా అషిక తెలిపారు.

Updated Date - Jan 10 , 2024 | 03:12 AM