సి202: 50 రోజులకు చేరువలో

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:31 AM

మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ చిత్రం 50 రోజులకు చేరువలో ఉంది.

మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. అక్టోబర్ 25న విడుదలై ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయినా విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మరియు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మరో వారంతో 50 రోజుల మైలురాయిని ఈ సినిమా చేరుకోనుంది.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మున్నా కాశీ మాట్లాడుతూ.. ‘సి 202’ చిత్రం అక్టోబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. మంచి రివ్యూస్ మరియు మౌత్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ పొంది ఆరు వారాలుగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడు మా చిత్రం ఏడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా ‘సి 202’ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ఇంకా ఈ సినిమా చూడని వారు మీ సమీప థియేటర్‌లో చూడాలని కోరుతున్నానని అన్నారు. షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు ఇతర పాత్రలలో నటించారు.

Updated Date - Dec 03 , 2024 | 12:31 AM