ఎంతో సంతృప్తిని ఇచ్చింది

ABN , Publish Date - Oct 31 , 2024 | 02:03 AM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ గురువారం గ్రాండ్‌ రిలీజ్‌ అవుతున్న...

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ గురువారం గ్రాండ్‌ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా నాగవంశీ మీడియాతో ముచ్చటించారు. ‘విడుదలకు ముందే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడినందుకు సంతోషంగా ఉంది. మంచి సినిమా చేశామనే సంతృప్తి అరుదుగా కలుగుతుంది. అలాంటి సంతృప్తిని ‘లక్కీ భాస్కర్‌’ కలిగించింది. మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బాక్సింగ్‌ నేపథ్యంలో థ్రిల్లర్‌ జానర్‌లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడూ భాస్కర్‌ గెలవాలని కోరుకుంటాడు. భాస్కర్‌ పాత్రలో తమని చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు. ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం’ అని నాగవంశీ తెలిపారు.

Updated Date - Oct 31 , 2024 | 02:04 AM