సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా బహుముఖం

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:14 AM

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసే హర్దివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం షూటింగ్‌ అంతా అమెరికాలోని వివిధ ప్రదేశాల్లో జరిగింది...

సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా బహుముఖం

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసే హర్దివ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం షూటింగ్‌ అంతా అమెరికాలోని వివిధ ప్రదేశాల్లో జరిగింది. ఈ నెల 5న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హర్దివ్‌ కార్తీక్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘మానసిక అనారోగ్యం ఉన్న ఓ వ్యక్తి ఓ ఆడిషన్‌కు వెళితే అక్కడ అతనికి అవమానం జరుగుతుంది. దాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత ఏం చేశాడన్న ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇటువంటి కథతో ఇంతవరకూ ఏ సినిమా రాలేదు. ఇప్పుడు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ చేశాను’ అని చెప్పారు. ‘ఇందులో దాదాపు 40 మంది కొత్త నటీనటులు ఉన్నారు. వ్రతిదీ వర్క్‌ షాప్‌ నిర్ణయించి క్లియర్‌ విజన్‌తో నిర్మించాను. ఖర్చు తగ్గించుకోవాలనే తపనతో చాలా శాఖలు నేనే నిర్వహించాను. పాటలను ఫణి కల్యాణ్‌ స్వరపరచగా, శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం అందించారు’ అని తెలిపారు హర్దివ్‌ కార్తీక్‌. తదుపరి చిత్రం కోసం ఓ యాక్షన్‌ డ్రామా రాసుకున్నాననీ, ఇన్ని శాఖలు కాకుండా ఏదో ఒక దాని మీదే దృష్టి పెడతానని ఆయన చెప్పారు.

Updated Date - Apr 03 , 2024 | 03:14 AM