పేదల కోసం వీరమల్లు పోరాటం

ABN , Publish Date - May 03 , 2024 | 05:32 AM

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం తొలి భాగం టీజర్‌ను యూనిట్‌ గురువారం విడుదల చేసింది....

పేదల కోసం వీరమల్లు పోరాటం

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం తొలి భాగం టీజర్‌ను యూనిట్‌ గురువారం విడుదల చేసింది. చార్మినార్‌, ఎర్రకోట లాంటి భారీసెట్‌లు, పవన్‌ కల్యాణ్‌ వీరోచిత పోరాట ఘట్టాలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు వెరసి సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. మరో అప్డేట్‌ను ఈ సందర్భంగా చిత్రబృందం పంచుకుంది. ఇకపై ‘హరిహర వీరమల్లు’ మిగిలిన చిత్రీకరణ,నిర్మాణానంతర కార్యక్రమాలను క్రిష్‌ పర్యవేక్షణలో దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తారని యూనిట్‌ తెలిపింది. ఈ ఏడాది చివర్లో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ అవనుంది. నిధి అగర్వాల్‌, బాబీడియోల్‌, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌, మనోజ్‌ పరమహంస.

Updated Date - May 03 , 2024 | 05:32 AM