వరుణ్‌తేజ్‌ విజృంభణ

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:23 AM

వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి కరుణకుమార్‌ దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి కీలక పాత్ర...

వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి కరుణకుమార్‌ దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో నిర్మించిన ఓ భారీ సెట్‌లో ప్రస్తుతం యాక్షన్‌ పార్ట్‌ చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలో చాలా కీలకమైన ఓ ఫైట్‌ను విజయ్‌ మాస్టర్‌ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ చాలా రిస్క్‌ తీసుకుని ఈ ఫైట్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. యాక్షన్‌ పార్ట్‌లో అతని విజృంభణను అదిరిపోయే లెవల్‌లో ఉంటుందని నిర్మాతలు చెప్పారు. అలాగే ఇంతవరకూ పోషించని ఓ విభన్న పాత్రలో వరుణ్‌తేజ్‌ కనిపించి ఆడియన్స్‌ను అలరించనున్నారు. అతని కెరీర్‌లో ఇదొక మైలు రాయిగా నిలుస్తుందని దర్శకుడు కరుణకుమార్‌ చెబుతున్నారు. వింటేజ్‌ వైజాగ్‌ను ఈ సినిమాలో చూడవచ్చని అంటున్నారు. టాప్‌ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:23 AM