వరుణ్‌ సందేశ్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:24 AM

వరుణ్‌ సందేశ్‌ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. శ్రీ అద్యాన్త్‌ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ...

వరుణ్‌ సందేశ్‌ థ్రిల్లర్‌

వరుణ్‌ సందేశ్‌ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. శ్రీ అద్యాన్త్‌ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమైంది. తొలి షాట్‌కు వరుణ్‌ సందేశ్‌ క్లాప్‌ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్‌ అజయ్‌ కుమార్‌ చిత్రీకరించారు. ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘సరికొత్త కథాంశంతో వస్తున్న సినిమా ఇది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక విభిన్నమైన కథాంశ ంతో వస్తున్న థ్రిల్లర్‌ చిత్రం. హీరో లుక్‌, క్యారెక్టరైజేషన్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘డిఫరెంట్‌ మేకింగ్‌, టేకింగ్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నాం. లొకేషన్స్‌ కూడా చాలా కొత్తగా ఉంటాయి. కథ, కథనంతో పాటు విజువల్స్‌ కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రంగా దీన్ని నిర్మించబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రంలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్‌, వైవా రాఘవ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎడిటర్‌: రామ్‌ తుము.

Updated Date - Jan 03 , 2024 | 12:24 AM