మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ముంబై పారిశ్రామికవేత్తతో వరలక్ష్మి శరత్‌కుమార్‌ నిశ్చితార్థం

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:45 AM

ప్రముఖ సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముంబైకు చెందిన పారిశ్రామికవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను పెళ్ళి చేసుకోనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం ముంబై నగరంలో ఇరు కుటుంబాల సమక్షంలో...

ముంబై పారిశ్రామికవేత్తతో వరలక్ష్మి శరత్‌కుమార్‌ నిశ్చితార్థం

ప్రముఖ సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముంబైకు చెందిన పారిశ్రామికవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను పెళ్ళి చేసుకోనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం ముంబై నగరంలో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. వివాహం ఈ ఏడాదిలోపు జరుగనుందని, త్వరలోనే వివాహ తేదీని వెల్లడిస్తామని వరలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, వీరిద్దరూ 14 ఏళ్ళుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎట్టకేలకు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈ నిశ్చితార్థంలో సినీ నటుడు శరత్‌ కుమార్‌, ఆయన సతీమణి రాధిక శరత్‌ కుమార్‌తో పాటు వరుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇటు తెలుగు, అటు తమిళ చిత్రసీమల్లో మంచి గుర్తింపుతో పాటు వరుస అవకాశాలు దక్కించుకుంటూ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 03 , 2024 | 01:45 AM