వాఘాలో వందేమాతరం

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:34 AM

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా భారత వైమానిక దళం నేపథ్యంలో రూపొందుతున్న దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌ కథానాయిక. ప్రతాప్‌సింగ్‌ హడా దర్శకత్వంలో సందీప్‌ ముద్దా నిర్మిస్తున్నారు...

వాఘాలో వందేమాతరం

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా భారత వైమానిక దళం నేపథ్యంలో రూపొందుతున్న దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్‌ కథానాయిక. ప్రతాప్‌సింగ్‌ హడా దర్శకత్వంలో సందీప్‌ ముద్దా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 16న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని యూనిట్‌ బుధవారం పంజాబ్‌లోని వాఘా సరిహద్దుల్లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ చిత్రబృందంతో పాల్గొన్నారు. వైమానిక దళం యుద్ధానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వచ్చే గీతమిది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మిక్కీ జే మేయర్‌ స్వరపరచగా అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.

Updated Date - Jan 18 , 2024 | 11:33 AM